టాలీవుడ్ నుండి దాదా సాహెబ్ పాల్కే అవార్డు 2020 సొంతం చేసుకుంది వీరేDadasaheb Phalke award
2021-01-02 14:50:22

సౌత్ లో దాదా సాహెబ్ పాల్కే అవార్డులను కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగులో వివిధ క్యాటగిరి లకు చెందిన వారిని అవార్డులకు ఎంపిక చేస్తూ పేర్లను ప్రకటించింది. తెలుగు నుండి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వీరిని వరించింది. తెలుగు ఉత్తమ సినిమా -జెర్సీ, ఉత్తమ నటుడు- నవీన్ పొలిశెట్టి(ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ) , ఉత్తమ సంగీత దర్శకుడు -థమన్ (అల వైకుంఠ పురంలో) ఉత్తమ నటి- రష్మిక మందన (డియర్  కామ్రేడ్), బెస్ట్ డైరెక్టర్ -సుజిత్ (సహా), మోస్ట్ వర్సటైల్ యాక్టర్ - అక్కినేని నాగార్జున లను అవార్డు వరించింది. తమ అభిమాన నటీనటులకు అవార్డులు రావడం పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారతీయ సినిమాకు సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. భారతీయ సినిమా పితమహుడిగా భవించబడే దాదా సాహెబ్ పాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఈ అవార్డులను అందజేస్తారు. సంవత్సరం మొత్తం వచ్చిన సినిమాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి అవార్డు కు ఎంపిక చేస్తారు.

More Related Stories