2020.. నీకు ఓ దండం.. త్వరగా వెళ్లిపో..indian Cinema
2020-06-16 08:29:30

కొత్త ఏడాది మొదలైన తర్వాత ఎన్నో కొత్త విషయాలు జరుగుతాయని.. అంతా కొత్త కొత్తగా ఉండబోతుందని కోటి ఆశలతో 2020 కి స్వాగతం పలికారు. కానీ ఈ ఏడాది ఉన్నంత చక్కగా దరిద్రంగా ఈ మధ్యకాలంలో ఏ సంవత్సరం కూడా లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి 2020లో అస్సలు కలిసి రావడం లేదు. ఏడాది మొదటి ఆరు నెలలు కూడా కాకముందే దాదాపు 30 మంది సెలబ్రిటీలు కన్నుమూశారు. దీన్ని బట్టి ఈ ఏడాది ఎంత దారుణంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా చనిపోవడంతో 2020లో మరో స్టార్ నేలరాలిపోయాడు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న చిరంజీవి సర్జా హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోకముందే సుశాంత్ కూడా దూరం అయిపోయాడు. ఇదే ఏడాది లెజెండరీ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ వరుస రోజుల్లో కన్నుమూసారు.

ఇక బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ అనారోగ్యంతో చనిపోయాడు. తమిళ ఇండస్ట్రీలో ఇద్దరు యువ దర్శకులు బాల మిత్రన్, అరుణ్ ప్రశస్త్ తొలి సినిమా విడుదల కాకుండానే చనిపోయారు. అంతేకాదు భారతీరాజా సినిమాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను మాయచేసిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కన్నన్ ఈ మధ్యే కన్నుమూశారు. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నటుడిగా అడుగులు వేస్తున్న సేతురామన్ మార్చిలో గుండెపోటుతో కన్నుమూశారు. మలయాళంలో తొలి సినిమా అప్పుడే విడుదలై మంచి బ్రేక్ కోసం చూస్తున్నా దర్శకుడు బిజిత్ జార్జ్ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడు. ఇలా ఒకరా ఇద్దరా ఎంతోమంది ఈ ఏడాది భౌతికంగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీ లక్ష్మీ కనకాల అనారోగ్యంతో చనిపోయింది. సల్మాన్ ఖాన్ మేనల్లుడు కూడా ఇదే ఏడాది చనిపోయాడు. ఇలా ఒక్కొక్కరు కన్ను మూసుకుంటే 2020 ముగిసేసరికి ఇంకెన్ని చెడు వార్త వినాల్సి వస్తుందో అని అంతా భయపడుతున్నారు. 

More Related Stories