కేసీఆర్ ఇలా ఎందుకు చేస్తున్నాడు.. బాలల చిత్రోత్సవానికి నో మనీ.. International childrens film festival
2019-11-14 01:36:05

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి జరుగుతున్న ఆనవాయితీ బాలల చలన చిత్రోత్సవం. ఈ వేడుక ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ లోనే జరుగుతూ వస్తోంది. 1979 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో నగరంలో ఈ బాలల చలన చిత్రోత్సవం జరుగుతోంది. హైదరాబాద్ కు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే ఉద్దేశంతో 2003 లో హైదరాబాద్ లో ఈ చలన చిత్రోత్సవం జరగగా.. అప్పటి నుండి ఇక్కడే వరుసగా చేస్తున్నారు. భారతదేశంలో మరియు నగరానికి వెళ్లకుండా ప్రతి రెండేళ్లకోసారి బాలల చలన హైదరాబాదులోని గత 16 ఏళ్లుగా జరుగుతుంది.

అంతర్జాతీయ మీడియా నుండి ఈ వేడుకకు కవరేజి ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెండు సార్లు హైదరాబాద్లో ఈ వేడుకలు జరిగాయి. 2015, 2017లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. కానీ ఈ ఏడాది మాత్రం తమకు ఆర్ధిక స్థోమత లేదని ప్రభుత్వం చెప్పడంతో ఈ వేడుక కాస్త వేరే నగరానికి వెళ్ళింది. అయితే ఈ వేడుకతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్ధికంగా వెనక ఉన్నామని తేల్చి చెప్పింది. కాగా బాలల చలన చిత్రోత్సవంకు రాష్ట్ర ప్రభుత్వం అంత డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కేంద్రం వాటా కూడా ఇందులో ఉంటుంది. అయితే ఈ వేడుక నిర్వహించడానికి ఆ మాత్రం కూడా ఖర్చు చెయ్యలేనంత దీనస్థితిలో తెలంగాణ ఆర్ధిక పరిస్థితి ఉందా..? అనే అనుమానం కలిగేలా తెలంగాణ సర్కార్ ప్రవర్తించింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో కూడా విమర్శలు కురుస్తుంది.

More Related Stories