విషాదం.. రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ళ నటి మృతి..accident
2020-05-28 02:38:52

లాక్ డౌన్ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో చాలా విషాదాలు జరుగుతున్నాయి. ఒకటి మరిచిపోయే లోపే మరకొటి వచ్చేస్తున్నాయి. గత నెల రోజులుగా దాదాపు ముగ్గురు నలుగురు నటీనటులు రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూసారు. ఇప్పుడు అవి మరిచిపోకముందే మరో నటి కూడా ఇలాగే చనిపోయింది. ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి మెబీనా మైఖెల్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఈమె మరణించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. కర్ణాటకలోని తన సొంతూరు మదికేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆమె కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌కు ఢీ కొట్టడంతో తీవ్రగాయాల పాలైన మెబీనా ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు వదిలేసింది. దేవిహిల్లి దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ప్యాతే హుదుగిర్ సీజన్ 4 అనే రియాలిటీ షోతో మెబీనా గుర్తింపు తెచ్చుకుంది. అందులో విజేతగా కూడా నిలిచింది ఈమె. ప్రముఖ కన్నడ యాంకర్ అకుల్ బాలాజీ దీనికి హోస్ట్. మెబీనా మృతిపై సోషల్ మీడియాలో ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేసాడు. ప్యాతే హుదుగిర్ విన్నర్.. తన ఫేవరెట్ కంటెస్టెంట్ మెబీనా మరణం తనకు జీర్ణించుకోలేనిదని.. ఇప్పటికీ ఈ విషయం తను నమ్మలేకపోతున్నానని ట్వీట్ చేసాడు అకుల్ బాలాజీ. ఇక కన్నడ సినీ ప్రముఖులు కూడా ఈమె మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 19 ఏళ్ల వయసులోనే రియాలిటీ షోకు వెళ్లి 12 మందిని దాటేసి విజేతగా నిలిచింది. ఇంత చిన్న వయసులోనే టాలెంటెడ్ నటిని కోల్పోవడం బాధాకరం అంటున్నారు కన్నడ సినీ ప్రముఖులు.

More Related Stories