కరోనా బాధితులకు కోటి 25 లక్షల విరాళం ఇచ్చిన అల్లు అర్జున్..Allu Arjun
2020-03-27 22:20:52

తెలుగు హీరోలు కరోనా వైరస్ బాధితులకు భారీగానే విరాళాలు ఇస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇవ్వనంత స్థాయిలో ఇప్పుడు ఒక్కొక్కరూ కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిధులకు కోటి రూపాయలు విరాళం అందించారు. ఇక ప్రభాస్ అయితే ఏకంగా నాలుగు కోట్లు విరాళం అందించాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ 70 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన వంతుగా కోటి 25 లక్షలు సాయం చేశాడు. మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త ఆలస్యంగా విరాళం ప్రకటించాడు కానీ అందరి కంటే కాస్త ఎక్కువగానే ఈయన డొనేట్ చేసాడు. 

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయనిధికి ఈ కోటి 25 లక్షలు విరాళం అందిస్తున్నట్లు వీడియో విడుదల చేశాడు అల్లు అర్జున్. అంతేకాకుండా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని.. బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు అని సూచించాడు. 21 రోజుల యుద్ధం కరోనా వైరస్ ను తుదముట్టించడానికి అని గుర్తు పెట్టుకోవాలి అని చెప్పాడు అల్లు అర్జున్. ఆయనతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా 10 లక్షలు ప్రకటించాడు. ఇక మెగా కుటుంబం నుంచి సాయి ధరమ్ తేజ్ కూడా పది లక్షలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చాడు. 

More Related Stories