బిగ్ బాస్ 3 అనుకున్నదే అయ్యింది ! Hema
2019-07-29 07:53:21

బిగ్ బాస్ 2 సీజన్ ని పట్టి కుదిపేసిన లీకుల పరంపర సీజన్ 3ని కూడా వదలడం లేదు. నిన్న ఒక సభ్యులు ఎలిమినేషన్ ఉండగా అది ముందే తెలిసిపోవడమే కాక, మరో సభ్యుని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ముందు నుండే ప్రచారం అయ్యింది. ప్రచారం జరిగినట్టే నటి హేమ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. మూడో సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లలో తొలివారం ఎలిమినేషన్‌కు ఆరుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వెళ్లిన రెండో రోజే రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలను ఎలిమినేషన్‌కు బిగ్ బాస్ నామినేట్ చేశారు. ఐదు రోజులపాటు ఈ ఆరుగురు ఎలిమినేషన్ భయంతో గడిపారు. మొత్తానికి నిన్న ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌ హేమ అని నాగార్జున తేల్చేశారు. అలాగే నిన్నటి షోలో సెలెబ్రిటీ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా షోలో ఎంట్రీ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్‌ను అయిన తనకు అవకాశం ఇచ్చినందుకు ఆమె బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పారు. తానేంటో నిరూపించుకుంటానని అందుకే హౌస్ లో చివరి వరకు ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం తమన్నాను హౌజ్‌లోకి పంపలేదు. బిగ్ బాస్ చెప్పినప్పుడు హౌజ్‌లోకి వెళ్లాలని, అప్పటి వరకు వేచి చూడాలని తమన్నాకు నాగార్జున చెప్పారు. ఆమె లోపలికి ఎప్పుడు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈమె ఎంట్రీ నేపధ్యంల్లో హౌస్ మేట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, మామూలు వాళ్ళని కర్రోడు అన్నా ఇంకేమన్నా అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఇలాంటి ప్రత్యేక వ్యక్తులను పొరపాటున నోరు జారి ఏమి అన్నా అది పెద్ద రాద్దాంతం అవుతుంది.  

More Related Stories