జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ 3 మంకీస్ ఫస్ట్ లుక్ విడుదల..3monkeys
2019-09-23 06:56:17

జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకుల మనసు దోచుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్మాల్ స్క్రీన్ లో ఇప్పుడున్న నటుల్లో సుడిగాలి సుధీర్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా మనోడు ఎప్పటికప్పుడు ఎఫైర్స్ తో కూడా వార్తల్లో ఉంటాడు. ఇప్పుడు ఈయన హీరోగా మారిపోయాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు ఇప్పుడు 3 మంకీస్ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో సుడిగాలి సుధీర్ టీం నటిస్తున్నారు. అంటే ఆటో రంప్రసాద్, గెటప్ శ్రీను అన్నమాట. ఈ ముగ్గురు ఇప్పుడు మూడు కోతలుగా మారిపోయారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. జబర్దస్త్ జడ్జి నాగబాబు దీన్ని లాంఛ్ చేసాడు. ఈ ముగ్గురు గురించి చెబుతూ మంచి టాలెంట్ ఉన్న నటులు అంటూ పొగిడాడు. జబర్దస్త్ షో నుంచి వచ్చిన అద్భుతమైన కమెడియన్స్ లో ఈ ముగ్గురు కూడా ఉన్నారంటున్నాడు నాగబాబు. కచ్చితంగా ఈ సినిమాతో వాళ్లు విజయం అందుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు మెగా బ్రదర్. మరి జబర్దస్త్ కమెడియన్స్ చేసే కోతి పనులు ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతాయో చూడాలి.

More Related Stories