బిగిల్ దండయాత్ర.. 300 కోట్ల క్లబ్బులో విజయ్..bigil
2019-11-18 12:21:48

త‌మిళ‌నాట ర‌జినీకాంత్ త‌ర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తోన్న హీరో విజ‌య్. ఈయ‌న సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌స్తే క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో ఊహించుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. ఇప్పుడు బిగిల్ విష‌యంలోనూ ఇదే జరిగింది. దివాళి కానుకగా మూడు వారాల కింద విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూలు చేసింది. నాలుగో వారంలో కూడా తమిళనాట మంచి వసూళ్లు సాధించింది బిగిల్. ఇప్పటి వరకు 16 రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. తొలిరోజు నుంచే దూకుడు మీదున్నాడు విజయ్. తెలుగులో కూడా ఈ చిత్రం 11.30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

ఇక్కడ విజయ్ సినిమాలకు ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగానే గొప్ప విషయం. సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్లలో దుమ్ము దులిపేసాడు విజయ్. ఇక తమిళనాట అయితే చెప్పనక్కర్లేదు. అక్కడ నాన్ ర‌జినీ కేట‌గిరీలో అన్ని రికార్డుల‌కు చెక్ చెబుతున్నాడు విజ‌య్. బిగిల్ తో క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళనాట ఇప్పటికే చాలా రికార్డులను తిరగరాసింది. ఐ, కబాలి లాంటి సినిమాల రికార్డులను కూడా తుడిచి పెట్టేసాడు విజయ్. సోషల్ మెసేజ్ ఉన్న కథ కావడం.. స్పోర్ట్స్ మాఫియాపై జ‌రుగుతున్న కాన్ టెంప‌ర‌రీ క‌థ కావ‌డంతో బిగిల్ కు బాగా క‌నెక్ట్ అయ్యారు ప్రేక్ష‌కులు. విజయ్ ద్విపాత్రిభినయం కూడా కలిసొచ్చింది. మొత్తానికి బిగిల్ తో రికార్డుల దుమ్ము దులిపేస్తున్నాడు ఇళ‌య ద‌ళ‌ప‌తి.

More Related Stories