మార్చ్ 31 వరకు థియేటర్స్, స్కూల్స్ మూసివేత..Telangana
2020-03-14 23:52:34

అనుకున్నదే జరిగింది.. తెలంగాణలో కూడా మార్చ్ 31 వరకు థియేటర్స్, మాల్స్, స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలను కేసీఆర్ జారీ చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ పేరు వింటే అందరూ వణికిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి కూడా భయంతో ప్రజలు కంపించిపోతున్నారు. ప్రపంచ దేశాలు కూడా కరోనా వైరస్ ను అరికట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కూడా ఈ వైరస్ ఇండియాకు వ్యాపించింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు ఇండియాలో ఇద్దరు ఇప్పటికే మరణించడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 80 మందికి ఈ వైరస్ వచ్చినట్లు గుర్తించారు. 

దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు. సినిమా ఇండస్ట్రీపై కూడా కరోనా వైరస్ ప్రభావం చాలా పడుతుంది. కలెక్షన్లు లేక వెలవెలబోతున్నాయి థియేటర్స్. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అరికట్టాలంటే థియేటర్లను మూసివేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. దాంతో పాటు స్కూల్స్, మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డర్స్ పాస్ చేసాడు. థియేటర్ల యజమానులు కూడా వసూళ్లు రాకపోవడంతో దానికి ఒప్పుకున్నారు. అంటే తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు సినిమాలు ఉండవన్న మాట. 

ఇప్పటికే అక్కడ విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాలను వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. అందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా కరోనా మహమ్మారి ఇండస్ట్రీని చావు దెబ్బ తీస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా సినిమాలకు కలెక్షన్లు లేవు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా కలెక్షన్లు తీసుకురాకపోవడంతో టికెట్ కౌంటర్ దగ్గర ఈగలు తోలుకుంటూ ఉన్నారు థియేటర్ యాజమాన్యం. ఇక్కడ థియేటర్లను మూసివేయాలని ఆలోచన లేకపోయినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎలాగోలా నడిపించాలని చూస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు.

More Related Stories