బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఎంచుకున్న కంటెస్టెంట్ లిస్ట్ ఇదేనా..?biggboss
2020-05-23 14:16:53

Bigg Boss 4: తెలుగులో బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ గేమ్ షోల్లో బిగ్‌బాస్‌ కూడా ఒకటి. తొలి సీజన్ సంచలనాలు సృష్టించింది.. రెండు మూడు పర్లేదనిపించాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. జులై నుంచి మొదలయ్యే ఈ షోలో కంటెస్టెంట్స్‌గా ఈ సారి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేయాలని చూస్తున్నారు స్టార్ మా. దీనికోసం భారీగానే ఖర్చు చేసి మరీ పేరున్న వాళ్లనే బిగ్ బాస్ హౌజ్‌కు పట్టుకొస్తున్నారని తెలుస్తుంది.

తరుణ్: ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది. ఈయన్ని గత సీజన్ కోసమే అడిగినా కూడా కొన్ని కారణాలతో దూరం అయ్యాడు. ఈ సారి ఒప్పించే పనిలో ఉన్నారు.

వర్షిణి: హాట్ యాంకర్ వర్షిణి బిగ్ బాస్ సీజన్ 4కి రావడం దాదాపు ఖాయం అయిపోయింది. ఈమెకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఇంటికి తీసుకొస్తున్నారు. పైగా బయట కూడా ఆఫర్స్ లేవు.. అన్నింటికి మించి అందాలు ఆరబోయడానికి ఈమె ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

మంగ్లీ: మరో యాంకర్ కమ్ సింగర్ మంగ్లీ కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌కు వస్తుందని ప్రచారం జరుగుతుంది. గతేడాది శివ జ్యోతిలా ఈ ఏడాది మంగ్లీని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అఖిల్ సార్ధక్: తెలుగు సీరియల్స్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ సార్థక్ ఈ సారి బిగ్ బాస్ 4 లిస్టులో కనిపిస్తున్నాడు.

ఝాన్సీ: యాంకర్ ఝాన్సీని అడిగినా కూడా ఎందుకో కానీ ఈమె ఒప్పుకోలేదని తెలుస్తుంది. పైగా గత సీజన్‌పై ఝాన్సీ కొన్ని కామెంట్స్ చేస్తే దానిపై స్టార్ మా కూడా సీరియస్ అయింది. బహుశా అదే కారణంతో ఆమె దూరంగా ఉంటుందనే వార్తలొస్తున్నాయి.

శ్రద్ధా దాస్: హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌కు ఎలాగూ ఆఫర్స్ లేవు.. అందుకే బిగ్ బాస్ వైపు అడుగులేస్తుంది.

వైవా హర్ష: గత రెండు సీజన్స్‌లో ఈయన పేరు కూడా వినిపించింది. యూ ట్యూబ్‌లో సొంత ఫాలోయింగ్ బాగానే తెచ్చుకున్న వైవా హర్ష వైపు బిగ్ బాస్ నిర్వాహకుల చూపులు పడుతున్నాయి. గతేడాది మహేష్ అలాగే వచ్చాడు.

సింగర్ సునీత: కల్పన, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ ఇలా ప్రతీ సీజన్‌లోనూ సింగర్స్‌ను సెలెక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ సారి కూడా అదే ఫార్మాట్‌లో సీనియర్ గాయని సునీతను ఎంచుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

నందు: సింగర్ గీతా మాధురి భర్త నందుకు బిగ్ బాస్ 4 ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జోరుగానే జరుగుతుంది.

రష్మి గౌతమ్: సంచలన యాంకర్ రష్మి గౌతమ్‌కు భారీ మొత్తం ఇచ్చి బిగ్ బాస్ 4లో తీసుకోవాలని చూస్తున్నారు. గతేడాది శ్రీముఖికి కోటి వరకు ఇచ్చి ఒప్పించినట్లే ఇప్పుడు రష్మి విషయంలో జరుగుతుందని తెలుస్తుంది.

కార్తిక దీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్: ప్రతీసారి సీరియల్ నటీమణులకు ఛాన్స్ ఇస్తున్నట్లుగానే ఈ సారి కార్తీక దీపం దీపకు ఛాన్సిస్తున్నట్లు తెలుస్తుంది. ఈమె కానీ వచ్చిందంటే రేటింగ్ కూడా పెరుగుతుందని నిర్వాహకుల అంచనా.

నాగార్జున: సీజన్ 4 కూడా నాగార్జున చేతుల్లోనే పెట్టాలని చూస్తున్నారు నిర్వాహకులు. మహేష్ బాబు, రవితేజ లాంటి పేర్లు వినిపించినా చివరికి నాగ్ సెట్టయ్యాడని తెలుస్తుంది

More Related Stories