బిగ్ బాస్ 4కు హోస్ట్‌గా మారుతున్న విజయ్ దేవరకొండ..Vijay Devarakonda
2020-07-09 01:38:58

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మొదలు కావాల్సిన బిగ్ బాస్ సీజన్ 4 ఇంకా మొదలు కాలేదు. తెలుగులో దీనికి చాలా క్రేజ్ వచ్చింది. అసలు రియాలిటీ షోలు చూస్తారా అనుకునే టైమ్ నుంచి మంచి రేటింగ్స్ తెచ్చుకునే స్థాయికి బిగ్ బాస్ ఎదిగింది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ కాగా.. ఆ తర్వాత నాని, నాగార్జున సీజన్స్ మాత్రం పర్లేదు అనిపించాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా దీనికి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాలుగో సీజన్ త్వరలోనే మొదలు కానుందని తెలుస్తుంది. ఇందులో హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

ఇక ఈ సీజన్ కు హోస్టుగా ముందు నాగార్జున పేరు వినిపించింది. ఆ తర్వాత సమంత అక్కినేని పేరు కూడా వచ్చింది. నాలుగో సీజన్ కోసం హీరోయిన్ అయితే బాగుంటుందని కూడా అనుకున్నారు నిర్వాహకులు. అయితే ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తుంది. ఈయన అయితే హోస్టుగా బాగుంటుందని నిర్వాహకులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ అయితే కచ్చితంగా క్రేజ్ కూడా డబుల్ అవుతుందని మా టీవీ యాజమాన్యం భావిస్తుంది. ఇందుకోసం విజయ్ దేవరకొండకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేస్తుందని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? 

More Related Stories