అప్పులతో మొహం చాటేసిన 400 కోట్ల నిర్మాత..kt
2019-09-27 21:58:34

ఇది సినిమా ఇండస్ట్రీ.. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతుంటాయి. బికారిని కోటీశ్వరుడిగా మార్చాలన్నా.. కోటీశ్వరుడిని రోడ్డు మీదకు తీసుకురావాలన్నా కూడా ఇండస్ట్రీకే సాధ్యం. ఇప్పుడు కూడా కొందరు నిర్మాతల పరిస్థితి ఇలాగే ఉంది. వందల కోట్ల సినిమాలు చేసిన నిర్మాతలు ఒక్క సినిమాతో పూర్తిగా నాశనమైపోతారంటే నమ్మశక్యం కాదు. కానీ ఇప్పుడు ఓ నిర్మాతను చూస్తుంటే మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడు జెంటిల్ మెన్, ప్రేమికుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన కుంజుమన్ రక్షకుడు అనే ఒకే పెద్ద సినిమాతో పూర్తిగా కనిపించకుండా పోయాడు. అలాంటి నిర్మాతలు ఇంకా చాలా మంది ఉన్నారు కూడా. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తమిళంలో కొన్నేళ్లుగా భారీ సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఓ భారీ నిర్మాణ సంస్థ ఇప్పుడు దారుణంగా నష్టాల పాలైందని తెలుస్తుంది. రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే అందులో కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి. గతేడాది ఏకంగా రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో 400 కోట్లతో సినిమా చేసాడు.. అయితే అది ఫ్లాప్ కావడంతో బయ్యర్ల బాధ తట్టుకోలేక ఇప్పుడు దాచుకుని తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన అప్పులు ఇప్పుడు 100 కోట్లకు పైగానే ఉన్నాయనేది వినిపిస్తున్న వార్త. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ తో కూడా భారీ బడ్జెట్ తో ఈయన సినిమా నిర్మిస్తున్నాడు. బడ్జెట్ లెక్కలేయడంలో తప్పుదోవ పట్టి పూర్తిగా ఇప్పుడు నష్టపోతున్నాడు ఆ నిర్మాత. మరి ఆయన ఎప్పుడు బయటికి వస్తాడనేది చూడాలిక.

More Related Stories