శంకర్‌కు వరసగా బ్యాడ్ న్యూస్‌లు.. శిష్యుడు మృతి.. Arun Prasath
2020-05-16 11:08:07

దర్శకుడు శంకర్ కు ఈ మధ్య టైమ్ అస్సలు బాగోలేదు. ఆ మధ్య భారతీయుడు 2 షూటింగ్ లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీ క్రేన్ పడి తన టీంలో కొందరు సభ్యులను కోల్పోయాడు ఈయన. ఈ బాధ నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో ఆప్తున్ని కోల్పోయాడు శంకర్. తమిళ యువ దర్శకుడు అరుణ్ ప్రకాష్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసాడు. ఈయన మరణవార్త తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా శంకర్ అయితే కన్నీరు పెట్టుకున్నాడు. ఈయన దగ్గరే అరుణ్ సహాయ దర్శకుడిగా పని చేసాడు. కోయంబత్తూర్ సమీపంలోని మెట్టుపాల్యం దగ్గర బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దర్శకుడు అరుణ్ ప్రాణాలు కోల్పోయాడు. 

జీవీ ప్రకాష్ హీరోగా నటించిన '4జీ' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు అరుణ్. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అంతలోనే ఈయన అనంతలోకాలకు వెళ్లిపోవడం తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నిపించింది. దీనిపై దర్శకుడు శంకర్ ట్వీట్ చేస్తూ.. తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గుండెలు పగిలే బాధని కలిగిస్తుందని.. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ తన హార్డ్ వర్క్‌తో కెరీర్‌లో ముందుకు సాగాడని.. ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు కోరుకున్నాడు శంకర్. ఇక తన దర్శకుడు అరుణ్ మృతిపై హీరో కమ్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కూడా దిగ్బంతికి లోనయ్యాడు. ఒక సోదరుడిని, మంచి మిత్రుడిని కోల్పోయానని ఆయన ట్వీట్ చేసాడు. 

More Related Stories