మహేష్ బాబు నుంచి రాబోయే 5 సినిమాలు ఇవే..mb
2020-02-03 05:23:08

సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మహేష్ బాబు కెరీర్ మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు సూపర్ స్టార్. ఆయన కోసం దర్శకులు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి తర్వాత సినిమా కన్ఫర్మ్ చేశాడు మహేష్. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పటివరకు రెస్ట్ తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం నాన్ స్టాప్ షూటింగ్ చేశాడు. అందుకే మూడు నెలల బ్రేక్ తీసుకుంటున్నాడు. అయితే ఒక్కసారి రిటర్న్ వచ్చిన తర్వాత మాత్రం అసలు ఆగడం లేదు మహేష్. వంశీ పైడిపల్లి సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడితో మరోసారి సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ విషయం తానే చెప్పాడు కూడా. అనిల్ వర్కింగ్ స్టైల్ అద్భుతంగా ఉందని.. అన్నీ కుదిరితే మరొకసారి ఆయనతో పని చేయాలని ఉందని సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ లో మహేష్ బాబు చెప్పాడు. ఈయనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సూపర్ స్టార్ కోసం ఒక కథ సిద్ధం చేయాలని చూస్తున్నాడు.

ఖలేజా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈయనతో పని చేయాలని పదేళ్లుగా ప్రయత్నిస్తున్న కూడా కుదరడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం కధ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత మహేష్ బాబు దగ్గరికి వస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా మహేష్ బాబు ఒక కథ అనుకుంటున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారని ప్రయత్నిస్తున్నాడు ప్రశాంత్. చివరగా సుకుమార్ కూడా మహేష్ బాబు కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. నిజానికి అల్లు అర్జున్ తో ప్రస్తుతం చేస్తున్న సినిమా మహేష్ బాబు చేయాలనుకున్నాడు. అనివార్య కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. అందుకే ఆయనతో మరోసారి వర్క్ చేయాలని చూస్తున్నాడు సుకుమార్. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన నేనొక్కడినే సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే మహేష్ బాబుకి నటుడిగా మాత్రం ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే సుకుమార్ తో మరోసారి పని చేయాలని భావిస్తున్నాడు సూపర్ స్టార్. మొత్తానికి రాబోయే 4 ఏళ్ల వరకు మహేష్ బాబు డైరీ ఫుల్ అయిపోయింది.

More Related Stories