డైరెక్ట్ గా ఆమెజాన్ లోకి ఏడు సినిమాలు...ఏమేమేమంటే Amazon Prime
2020-05-15 11:42:01

ఏ రంగమైనా కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ జనరేషన్ కి తగ్గట్టు కొత్త మార్పులను అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఆడియన్స్ తో డిస్ కనెక్ట్ ఏర్పుడుతోంది. మారుతున్న గ్లోబలైజైషన్ తో  సినిమా ఫీల్డ్ కూడా కొత్త పుంత్తలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సినిమా కోసం థియేటర్ కి పరుగులు తీసిన ప్రేక్షకులు ఇప్పుడు కూర్చున్న చోటే సినిమాను ఆస్వాధిస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని సినిమా నెట్టింట్లో నుండి నట్టింట్లోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సినిమా అరచేతిలోకి వచ్చేసింది. సినిమాలను సైతం తలదన్నే రితీలో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో ఫీల్మ్ మేకర్స్ మారుతున్న ఎంటర్ టైన్ మెంట్ కి అనుగుణంగా సరికొత్త ఆలోచనలతో ఆడియన్స్ కి గాలం వేస్తున్నారు. 

ఇక ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సినిమా కంటే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌’దే పై చేయి అయ్యే చాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా థియేటర్ లో ఉండగానే టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్స్ లో చూసే అవకాశం కల్పిస్తు ఓటీటీలు ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తున్నాయి. టాక్ బాగుండి థియేటర్స్ లో ఆడని సినిమాలకు ఓటీటీ లాభాలను తెచ్చిపెడుతోంది. చిన్న సినిమాల నిర్మాతలకు డిజిటల్ మీడియా ధైర్యం ఇస్తోందని చెప్పొచ్చు. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులతో మేకర్స్ సినిమాను ఆడియన్స్ కి మరింత దగ్గర చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ కరోనా దానికి మరింత ఊతం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందకంటే కరోనా దెబ్బకు ఇప్పటికే హాల్స్ మూత పడ్డాయి. ఇక ప్రేక్షకుల ఏకైక టైం పాస్ ఒటీటీగా మారింది. అయితే ఇప్పుడు ఏకంగా ఏడు సినిమాలు ఆమెజాన్ లో డైరెక్ట్ రిలీజ్ కి రెడీ కావడం సంచలనంగా మారింది. తెలుగలో పెంగ్విన్ తో కలిపి మొత్తం ఏడు సినిమాల‌ను నేరుగా త‌మ స్ట్రీమింగ్ స‌ర్వీస్ పై ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్రసారం కానున్న సినిమాలు ఇవే.

పొన్ మగల్ వంధల్ (తమిళం)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ -  మే 29, 2020
క్యాస్ట్  - జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్
డైరెక్టర్ - జె.జె. ఫ్రెడరిక్
ప్రొడక్షన్  - సూరియ, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్

గులాబో సితాబో (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ -  జూన్ 12, 2020
క్యాస్ట్  - అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా
రచన - జూహి చతుర్వేది
డైరెక్టర్ - షూజిత్ సిర్కార్
ప్రొడక్షన్  - రోన్ని లాహిరి, శీల్ కుమార్

పెంగ్విన్ (తమిళం, తెలుగు),
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - జూన్ 19, 2020
క్యాస్ట్  - కీర్తి సురేశ్
డైరెక్టర్ - ఈశ్వర్ కార్తీక్
ప్రొడక్షన్  - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్

లా (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - జూన్ 26, 2020
క్యాస్ట్  - రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు
డైరెక్టర్ - రఘు సమర్థ్
ప్రొడక్షన్  - అశ్విని, పునీత్ రాజ్ కుమార్

ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - జూలై 24, 2020
క్యాస్ట్  - డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్  
డైరెక్టర్ - పన్నాగ భరణ
ప్రొడక్షన్  - అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్

శకుంతలా దేవి (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - త్వరలో ప్రకటించబడుతుంది
క్యాస్ట్  - విద్యాబాలన్ర
డైరెక్టర్ - అనూ మీనన్
ప్రొడక్షన్  - అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.

సుఫియాం సుజాతాయం (మలయాళం)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - త్వరలో ప్రకటించబడుతుంది
క్యాస్ట్  - అదితి రావు హైదరీ, జయ సూర్య
డైరెక్టర్ - నరని పుజా షానవాస్
ప్రొడక్షన్  - విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్.

More Related Stories