ఏప్రిల్ 8వ తారీఖుతో చిరుకున్న అనుబంధం అదేనా chiranjeevi
2020-04-07 11:26:11

కొత్తొక వింత పాతొక రోత అంటారు పెద్దలు. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన మొన్న సోషల్ మీడియాలో అడుగు పెట్టింది మొదలు. ఆన్ లైన్ లోనే రచ్చ చేస్తున్నారు, దాదాపు ప్రతి రోజూ ఆయన ట్వీట్ వేస్తున్నారు. తన పాత మిత్రులను కవ్విస్తూ, కరోనా కోసం విరాళాల సేకరణ చేస్తూ తన అనుభూతులను పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు చిరు. తాజాగా నిన్న ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ వేశారు. #8thApril ...... ...ఈ తారీఖుతో నాకు బోల్డంత అనుబంధం ఉంది ... ... ...  (సశేషం)......to be continued అంటూ ఒక ట్వీట్ చేశారు. దీంతో అసలు ఏప్రిల్ 8వ తారీఖుతో చిరుకు అంత అనుబంధం ఏమిటా ? అనే చర్చ మొదలైంది. 

నిజానికి అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 కావడంతో అల్లు అర్జున్ ని గురించే ఈ ట్వీట్ చేసి ఉండచ్చని అంటున్నార్. అయితే బన్నీ ఒక్కడి బర్త్ డేకి చిరు ఇంత స్పెషల్ గా ట్వీట్ వేసి మరీ అటేన్షన్ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే అదే రోజు పవన్ కొడుకు అకీరా నందన్ బర్త్ డే కూడా అంటున్నారు. ఇక వీరిద్దరూ కాక నాగార్జన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 8నేనట. దాదాపు బన్నీ, అకీరా, అఖిల్ అందరినీ తన పిల్లల్లాగే భావిస్తాడట చిరు. అందుకే ఈ ముగ్గురి పుట్టిన రోజు ఒకే రోజు కావడంతో చిరు ఈ స్పెషల్ ట్వీట్ వేసినట్లుగా భావిస్తున్నారు తెలుస్తోంది. అంతే కాక టు బి కంటిన్యూడ్ అని కూడా పేర్కొనడంతో చిరు నుంచి వీళ్ల పుట్టిన రోజు అంటే రేపటి దాకా మరిన్ని ట్వీట్లు పడబోతున్నాయన్నని అంటున్నారు.  ఇక బన్నీ పుట్టినరోజు పునసకరించుకుని సుక్కూ యూనిట్ ఒక ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనుంది.

More Related Stories