అమలాపాల్ తో విడాకులు అందుకే...విజయ్ తండ్రి సంచలనంamalapaul
2020-04-19 11:04:43

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, హీరోయిన్ అమలాపాల్ 2014లో ప్రేమించుకుని ఆ తర్వాత ఆ ప్రేమను వివాహ బంధంతో ముగించారు. ఆయిత అనతి కాలంలోనే వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అమలా పాల్ సినిమాల్లో నటించే విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తి అదే వారి మధ్య విడాకులకి దారి తీసిందనేది ఈ విషయంగా జరిగిన ప్రచారం. విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ హీరోయిన్ గా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టింది. అమలాపాల్ నటించిన 'ఆమె' లాంటి సినిమా రిలీజ్ అయి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఆ మధ్య అమల మాజీ భర్తకి వివాహం జరిగింది. మొన్నీమధ్య అమల కూడా పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరిగినా అదంతా బ్రాండ్ షూట్ అని తేల్చేసింది. అయితే ఈ విడాకులు ఎందుకు తీసుకోవలసి వచ్చిందనే విషయాన్ని విజయ్ తండ్రి బహిర్గతం చేశారు. పెళ్లి తరువాత అమలా పాల్ సినిమాలు చేయడం తన కొడుకు విజయ్ కి ఇష్టం లేదని నిజానికి ముందు అతని ఇష్ట ప్రకారమే మానేస్తానని మాట ఇచ్చిన అమలా ఆ తరువాత మాట తప్పి వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టిందని అన్నారు. తాము చెప్పినా ఆమె పుట్టింటివారు చెప్పినా ఆమె తన పద్ధతిని మార్చుకోలేదని అన్నారు. ఎవరు ఎంతగా చెబుతున్నా ఆమె పట్టించుకోకపోవడంతో, విడాకుల వరకూ వెళ్లవలసి వచ్చిందని  విజయ్ తండ్రి ‘అజగప్పన్’ పేర్కొన్నారు.

More Related Stories