థాంక్యూ తమ్ముడూ... రౌడీ పై బన్నీ ఆసక్తికర ట్వీట్



Vijay Devarakonda
2020-12-03 13:36:35

టాలీవుడ్ లో తన స్టైల్ తో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. బన్నీ సినిమాల్లోనే కాకుండా భయట కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఇంప్రెస్ చేస్తుంటాడు. కాగా తాజాగా విజయ్ తన "రౌడీ" బ్రాండ్ దుస్తులను అల్లు అర్జున్ కి పంపించాడు. ఆ దుస్తులను దరించిన అల్లు అర్జున్ "థాంక్యూ బ్రదర్ విజయ్ దేవరకొండ..థాంక్యూ రౌడీ టీమ్ ఈ కూల్ డ్రెస్ పంపినందుకు" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన విజయ్ " స్టన్నింగ్ అన్నో" అంటూ రీప్లే ఇచ్చాడు. గతంలో కూడా విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ బట్టలను అల్లు అర్జున్ కి పంపించాడు. 

ఆ బట్టలను బన్నీ "అల వైకుంటాపురంలో" సినిమా ఆడియో ఫంక్షన్ లో వేసుకుని సందడి చేసాడు. ఇదిలా ఉండగా అలా వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప" సినిమాలో  నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పుష్ప పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతోంది.

More Related Stories