పవన్ సినిమాలో బిడ్డకి తల్లిగా నాగ్ హీరోయిన్..

అసలు సినిమాలు చేయనని తేల్చేసిన పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ఇప్పుడు పింక్ రీమేక్ తెరకేక్కుతోంది. దర్శకుడు వేణుశ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి కానీ ఇంకా హీరోయిన్ అనేదే పెను సమస్యగా మారిందని అంటున్నారు.
ఈ సినిమా కధ ప్రకారం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో నివేదా థామస్, అనన్యలు రెండు పాత్రలు షోషిస్తున్నారు. ఇక వీరుద్దరు సరే కానీ పవన్ సరసన నటించేది ఎవరు? అనే దాని మీదే ఇప్పుడు క్లారిటీ రావడంలేదు. గతంలో పూజా హెగ్డే, అంజలి పేర్లు వినిపించినా ఇప్పుడు మరో పేరు తెర మీదకు వచ్చింది. ‘మళ్లీరావా’, ‘దేవదాస్’ సినిమాల్లో నటించిన ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో పవన్‌కు జోడిగా కనిపించనుందని ప్రచారం మొదలయింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఆమె ఓ బిడ్డకి తల్లిగా కనిపించనుందట.