ఆకాశవాణికి గ్రహణం వీడింది Aakashavaani First look
2020-08-03 18:46:12

రాజమౌళి కొడుకు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా, అశ్విన్‌ గంగరాజు అనే యువకుడుగా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. నిజానికి ఈ సినిమాకి గుమ్మడి కాయ కొట్టి ఏడాది అవుతోంది. ఆ సినిమాకి ఆకాశవాణి అనే టైటిల్ కూడా పెట్టుకున్నారు. జక్కన్న వద్దే శిష్యరికం చేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహించన ఈ సినిమాని వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల నుంచి కార్తికేయ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆ మధ్య తానే ప్రకటించాడు కూడా. అది కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. 

కార్తికేయ మొదటి నుంచి జక్కన్న చిత్రాలకు ప్రొడక్షన్, మార్కెటింగ్‌ విషయాల్లో తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఇప్పటి దాకా ఆ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ని అనుకున్న సయానికి పూర్తి చేసి.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇక ఊపిరి సలపకుండా శ్రమించాల్సి ఉందని అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నాడని అన్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను హీరో రానా ఆదివారం విడుదలచేశారు. ఇందులో మర్రిచెట్టు ఊడలను పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతున్న ఓబాలుడు రేడియో వింటూ కనిపిస్తున్నాడు. ‘పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. రాజమౌళి వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన అశ్విన్‌ గంగరాజు ఈ సినిమాని తెరకెక్కించాడు.  

More Related Stories