అమీర్ ఖాన్ ఇంట్లో కరోనావైరస్.. అమ్మ కోసం ప్రార్థించాలి అంటూ విన్నపం..Aamir Khan
2020-07-01 14:26:58

చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు ఇండియాలో తారాస్థాయిలో ఉంది ఈ మహమ్మారి. రోజుకు 20 వేల కేసులకు చేరువలో వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కూడా చాలామంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదిలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ ఇంట్లోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఆయన స్టాఫ్ లో కొంత మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఒక ప్రకటన విడుదల చేశాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. సిబ్బందికి కరోనా వచ్చింది అని తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు ఆయన. వాళ్లు కూడా అంతే వేగంగా వైరస్ సోకిన వాళ్లను ఐసోలేషన్ కి తరలించారు. 

మరోవైపు అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో తన తల్లికి నెగిటివ్ రావాలని ఆ దేవుడిని ప్రార్థించండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులను అమీర్ ఖాన్ విన్నవించుకోవడం ఆయన సన్నిహితులను కలవరపెడుతోంది. ఏదేమైనా కూడా తన సిబ్బందికి తాను అండగా ఉంటానని వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెబుతున్నాడు అమీర్ ఖాన్. ఈమధ్య బోనికపూర్ ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా కరోనా సోకింది. దాంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు అభిమానులను కోరుతున్నారు. 

More Related Stories