అఖిల్ ఐదో సినిమా దర్శకుడు ఎవరో తెలుసా..Akhil PS Mitran
2019-10-17 14:36:08

అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసాడు. మూడు పోయాయి.. బాక్సాఫీస్ దగ్గర తొలి హిట్ ఎలా ఉంటుందో చూడాలని తహతహలాడుతున్నాడు అక్కినేని వారసుడు. ప్రస్తుతం విచిత్రంగా ఎవరూ ఊహించని విధంగా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు ఈయన. హిట్టు ఫ్లాపు పక్కనబెట్టి కథ నచ్చి ఈ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. పైగా అల్లు అరవింద్ లాంటి నిర్మాత దీనివెనక ఉన్నాడు. దాంతో కథ కచ్చితంగా బాగుండే ఉంటుందని నమ్ముతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే బొమ్మరిల్లు భాస్కర్ సెట్స్ పై ఉండగానే అప్పుడే ఐదో సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈ హీరో. తమిళ దర్శకుడు మిత్రన్ తో ఈయన ఐదో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈయనకు హైదరాబాద్ లో పార్టీ కూడా ఇచ్చాడు అఖిల్. అతడితో పాటు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం మిత్రన్ తమిళనాట వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ సినిమా చేయడానికి సరే అనేసాడు. మార్చ్ 2020 నుంచి అఖిల్, మిత్రన్ సినిమా పట్టాలెక్కబోతుంది. ఓ ఎన్నారై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో అఖిల్ సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక.. అదెలా ఉండబోతుందో..? 

More Related Stories