జార్జ్ రెడ్డి చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్న అభిషేక్ పిక్చర్స్.. George Reddy
2019-10-10 16:34:24

చరిత్రలో ఎంతోమంది గొప్పవాళ్లు ఉంటారు. కొందరు మనకు కనీసం తెలియకుండానే కనుమరుగైపోతుంటారు. అలాంటి ఓ చరిత్రను ఈ మధ్యే సైరా అంటూ తీసుకొచ్చాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఇలాగే రాబోతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టిన ఓ అరుణ తార బయోపిక్ ఇది. అదే జార్జ్ రెడ్డి. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ 60, 70వ దశకాల్లో ఈయన సింహ స్వప్నం. 25 ఏళ్లకే కన్నుమూసిన జార్జ్.. ఉన్నపుడు మాత్రం ఎన్నో ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాడు. ఆయన చేసిన పోరాటాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. సందీప్ మాధవ్ హీరోగా ఉస్మానియా యూనివర్సిటీ అరుణ తార జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఇప్పుడు సినిమా తెరకెక్కిస్తున్నాడు జీవన్ రెడ్డి. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు లాంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్.. ఇప్పుడు జార్జ్ రెడ్డి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మైక్ మూవీస్, సిల్లీమాంక్ స్టూడియోస్, త్రీ లైన్స్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా జార్జ్ రెడ్డి సినిమాను నిర్మించాయి. సుధాకర్ ఎక్కంటి సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మాత. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

More Related Stories