నిన్న ఆచార్య నేడు ఆర్ఆర్ఆర్...క‌రోనాతో షూటింగ్ల‌కు బ్రేకులు



Acharya RRR
2021-04-20 16:24:32

రాష్ట్రంలో కరోనా టెర్రర్ కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. ఇక కరోనా విజృంభనతో మరోసారి సినిమా షూటింగ్ లకు బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే ఖిలాడి, ఎఫ్ 3, దృశ్యం, ఆది పురుష్ సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 

ఇక నిన్న మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాకు సైతం బ్రేక్ పడింది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సోనూ సూద్ కరోనా బారిన పడ్డారు. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న‌కు బ్రేక్ కావాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు మెగాస్టార్ సైతం షూటింగ్ వాయిదా వేసుకోవడమే ఉత్తమం అని భావించారట. దాంతో ఆచార్య సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. 

ఇక తాజాగా ఈరోజు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను సైతం వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి షూటింగ్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట‌. గ‌తంలోనూ కరోనా విజృంభ‌న కారణంగా ఈ రెండు సినిమా షూటింగ్లకు బ్రేక్ పడగా ఇది రెండో సారి. ఇక ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల షూటింగ్ లు చివ‌రిద‌శ‌కు చేరుకున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌రోసారి వాయిదా ప‌డ‌టంతో ఫ్యాన్స్ లో ఆందోళ‌న మొద‌లైంది. 

More Related Stories