వర్ష బీభత్సం..ఆచార్య టీం కు భారీ నష్టంAcharya
2020-10-15 17:42:09

అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే అధికారులు అలర్ట్ ప్రకటించారు. గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో అత్యవసరమైతే తప్ప భయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు వర్షాల ఎఫెక్ట్ సినిమా షూటింగ్ల పై కూడా పడింది. వర్షాల కారణంగా దాదాపు డజనుకు పైగా సినిమాల షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి "ఆచార్య" షూటింగ్ కూడా వాయిదా పడింది. అంతే కాకుండా చిత్ర యూనిట్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. గత రాత్రి కురిసిన వర్షాలకు ఆచార్య షూటింగ్ కోసం వేసిన సెట్ పడిపోయే స్థితికి వచ్చినట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే రెండు సార్లు సెట్ వేసినట్టు సమాచారం. సినిమా సెట్ పడవ్వడంతో నిర్మాత రాంచరణ్ కు దాదాపు 3కోట్ల వరకు నష్టం వచ్చిందని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావిస్తుండగా సెట్ పడవ్వడంతో మరింత నష్టం వాటిల్లిందట. ఇదిలా ఉండగా ఆచార్య సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. సినిమాను థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఇక మెగాస్టర్ తో మెగా పవర్ స్టార్ కలిసి నటించడంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

More Related Stories