చిరు లేకుండానే ఆచార్య షూటింగ్Acharya
2020-11-13 19:29:52

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చిరుకి కరోనా రావడంతో ఆచార్య షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని  అభిమానులు అనుకున్నారు. అయితే తాజాగా కొరటాల శివ చిరంజీవి లేకుండానే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టారు. హీరో అవసరం లేని సన్నివేశాలను ముందుగా చిత్రించేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో కొరటాల పక్కా ప్రణాళికతో షూటింగ్ ను ప్రారంభించారు. గురువారం చిత్రికరణను పునరుద్ధరించారు. అయితే మెగాస్టార్ స్వయంగా తాను అవసరం లేని సన్నివేశాలను చిత్రికరించాలని చెప్పారట. దాంతో కొరటాల షూటింగ్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. కొరటాల చక చకా క్యారెక్టర్ ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రిస్తున్నారు. ఇక ఎలాగూ మెగాస్టార్ సెట్స్ పైకి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కాజల్ కి కూడా గ్యాప్ దొరికింది. దాంతో కాజూ పాప కూడా మరికొన్ని రోజులు హనీమూన్ ను ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది.

More Related Stories