పుష్ప సెట్ లో ఆచార్య



Acharya
2021-02-08 13:37:12

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ మారేడ్ మల్లి అడవుల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని పుష్ప టీమ్ తిరుగు ప్రయాణం అయ్యిందట. అయితే ఇప్పుడు అక్కడికే "ఆచార్య" బృందం కూడా వెళుతున్నట్టు సమాచారం. మారేడ్ మిల్లి అడవుల్లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతునట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా..సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవలే చరణ్ కూడా ఆచార్య సెట్ లో అడుగుపెట్టాడు.  చరణ్ ఒకవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటూ ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మారేడ్ మిల్లి పుష్ప సెట్స్ లో చరణ్ పైనే కీలక సన్నివేశాలు చిత్రించబోతున్నారు. మారేడ్ మిల్లి అడవుల్లో పుష్ప కోసం ఒక ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు ఆచార్య టీమ్ కూడా అక్కడే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే పై కూడా కొన్ని సన్నివేశాలను మారేడ్ మిల్లిలోనే చిత్రిస్తారట. దాంతో పూజా కూడా అడవుల బాట పట్టే అవకాశం ఉంది.

More Related Stories