సినీపరిశ్రమలో విషాదం..స్నానానికి వెళ్లి నటుడు మృతిAnil Nedumangad
2020-12-26 12:01:29

సినిపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి  చెందిన ప్రముఖ నటుడు అనిల్ పి.నేదుమంగాడ్ మరణించారు. అనిల్ ఓ సినిమా షూటింగ్ కోసం కేరళలోని మలంకర కి వెళ్లారు. క్రిస్మస్ సంధర్భంగా ఆయన మిత్రులతో కలిసి సరదాగా దగ్గరలోని ఆనకట్ట వద్దకు స్నానానికి వెల్లరు. కాగా ఆయనను మృత్యువు వెంటాడటంతో నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. అనిల్ కెరీర్ మొదట్లో బుల్లితెరపై యాంకర్ గా..నిర్మాతగా రాణించారు. ఆ తరవాత 2014 లో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి వచ్చిన అనతికాలంలోనే ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పావడ, కిస్మత్, పెరోల్ సినిమాల్లో అనిల్ నటించారు. అంతే కాకుండా తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్న "అయ్యప్పనుమ్ కొషియం" సినిమాలో అనిల్ నటించారు. ఇక అనిల్ మృతికి కన్నడ స్టార్ హీరోలు సంతాపం తెలిపారు.

More Related Stories