లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే చిప్ప బతుకు అయిపోతుంది..Actor Brahmaji
2020-05-14 23:36:09

ఎవరు ఈ మాటలు అన్నది అనుకుంటున్నారా.. తెలుగు ఇండస్ట్రీలో గత 30 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విభిన్నమైన పాత్రలు వేస్తూ వస్తున్న నటుడు బ్రహ్మాజీ ఇప్పుడు సంచలన ట్వీట్ చేశాడు. గత రెండు నెలలుగా లాక్ డౌన్ పేరుతో ఇంట్లో అందర్నీ కూర్చోబెట్టారు. దాంతో ఆదాయం కూడా గండిపడింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వేలకోట్ల రాష్ట్రాలు చవిచూసింది. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆర్టిస్టులు కూడా నెలల తరబడి ఇంట్లో కూర్చోవడం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు బ్రహ్మాజీ ప్రస్తుత పరిస్థితులను కామెడీ చేస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అందులో ఆయన చేతిలో ఒక చిప్ప ఉంది. దీనంగా చూస్తున్న ఆ ఫోటోని విడుదల చేశాడు బ్రహ్మాజీ. మరి కొన్ని రోజులు ఇలాగే పరిస్థితి ఉంటే కచ్చితంగా తమ కండిషన్ ఇలాగే ఉంటుంది అంటూ చేతిలో బొచ్చ ఒకటి పట్టుకొని పోజు ఇచ్చాడు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది కొందరికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది కూడా. ఇండస్ట్రీలో కొందరు నిజంగానే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు సినిమాలు చేయకపోతే పూట గడవదు. మరి ఈ పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. 

More Related Stories