ఇండస్ట్రీలో విషాదం..యంగ్ హీరోయిన్ మృతిActor Mishti Mukherjee
2020-10-04 21:56:31

బాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నటులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరణించడం తో పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కాగా తాజాగా యంగ్ హీరోయిన్ మిస్తీ ముఖర్జీ అనారోగ్యంతో కన్ను మూసింది. మిస్తీ ముఖర్జీ రెండు కిడ్నీలు పాడవ్వడం తో మరణించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె కొంత కాలంగా కీటో డైట్ ను పాటిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మిస్తీ అంత్యక్రియలను బెంగుళూరులో పూర్తి చేసినట్టు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. మిస్త్రీ మొదట2013లో కుహు  సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత 2014 లో కాంచి అనే సినిమాలో మిస్త్రీ హీరోయిన్ గా నటించారు. మిస్త్రీ నటనకు మంచి మార్కులు పడటంతో గ్రేట్ గ్రాండ్ మస్తీ, లైఫ్ కి తో లగ్ గయి, బేగం జాన్ సినిమాల్లో నటించారు. ఇక చివరగా మిస్త్రీ మణికర్ణిక సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా కేవలం 27 సంవత్సరాల వయస్సులో మిస్త్రీ మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె అభిమానులు, బాలీవుడ్ నటీనటులు మిస్త్రీ మృతిపై సంతాపం తెలిపారు.

More Related Stories