కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకున్న హీరో నాగార్జున..



Actor Nagarjuna
2021-03-17 14:14:35

ఆ మధ్య కాస్త తగ్గినట్టు కనిపించినా కరోనా వైరస్ దేశంలో మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలైపోయింది. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. 60 ఏళ్ళ పైబడిన వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది అంటూ ప్రభుత్వం కూడా సూచించింది. దాంతో ఇప్పుడు హీరో నాగార్జున వ్యాక్సిన్ వేయించుకున్నాడు. రెండు దశలుగా వేసే ఈ వ్యాక్సిన్ లో ఫస్ట్ జాబ్ పూర్తిచేశాడు. త్వరలోనే మరో వ్యాక్సిన్ కూడా వేయించుకోనున్నాడు నాగార్జున. ఇదిలా ఉంటే ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న ముందుకు రానుంది. కొత్త దర్శకుడు సోలోమన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే హిందీలో బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి చేశాడు. ఇక తెలుగులో బంగార్రాజు త్వరలోనే మొదలు కానుంది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా బంగార్రాజు వస్తుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దీనికి దర్శకుడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది అని.. అందుకే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అంటున్నాడు నాగార్జున. ముఖ్యంగా బౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు పెట్టుకొని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాడు. అందరూ కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని సూచిస్తున్నాడు.

More Related Stories