నాగార్జున కొత్త బిజినెస్ ఓటీటీ కాదట...అంతకు మించి



Nagarjuna
2021-05-22 16:52:42

కరోనా ఎఫెక్ట్ తో హీరోలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. షూటింగ్ లు లేకపోవడంతో కొంతమంది హీరోలు కొత్తం కథలను వింటున్నారు. ఫ్యూచర్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే నాగార్జున మాత్రం కొత్తం బిజినెస్ ప్లాన్ లో ఉన్నారు. కొద్దిరోజులుగా నాగ్ ఓటీటీ బిజినెస్ లోకి అడుగుపెడతారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు గానీ తాజాగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా చరిత్ర చెదరకుండా ఉండేందుకు నాగ్ ఒక ఆలోచన చేస్తున్నారట. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ వెల్లడించారు. తెలుగు సినిమా క్లాసిక్ లన్నింటినీ సేకరించి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది తన కల అని నాగ్ వెల్లడించారు. 

నాగ్ మాట్లాడుతూ " మన తెలుగు క్లాసిక్ సినిమాలన్నింటినీ సేకరించి ఒక మ్యూజియంలో ఎందుకు ఏర్పాటు చేయకూడదని నేననుకున్నాను. దానికోసం నేను దేశంలోని అర్చివిక్ట్స్ తో టచ్ లో ఉన్నాను. కానీ కరోనా మహమ్మారి వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి.కానీ మ్యూజియం కోసం పురాతన వస్తువుల సేకరణ కొనసాగుతుంది. మ్యూజియం లో నాన్న గారు అక్కినేని నాగేశ్వరరావు గారి కాలం నుండి ఇప్పటి వరకు ఉపయోగించిన టెక్నాలజీ కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి." అంటూ నాగార్జున వెల్లడించారు.

More Related Stories