సెల్ఫ్ క్వారంటైన్ లో ప్రభాస్



Actor Prabhas
2021-04-21 18:44:00

టాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతోంది. నటీనటులు టెక్నీషియన్స్ కరోనా మహమ్మారి బారిన పడటం తో షూటింగ్ లను నిలిపివేస్తున్నారు. ఇక మరికొన్ని సినిమా షూటింగ్ లను ముందు జాగ్రత్తగా వాయిదా వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 

ప్రభాస్ మేకప్ ఆర్టిస్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రభాస్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు సమాచారం. అంతే కాకుండా రాధే శ్యామ్ యూనిట్ సభ్యులంతా  క్వారన్‌టైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రభాస్ మొన్నటి వరకు ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే మహారాష్ట్ర లో లాక్ డౌన్ విధించడం తో ఆది పురుష్ షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తికాగా కొన్ని సీన్లను రీషూట్ చేయాలని భావించారట. దానికోసం పది రోజులు షెడ్యూల్ వేసుకోగా కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు మళ్లీ షూట్ వాయిదా పడింది.

More Related Stories