రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత..జూబ్లీహిల్స్‌ అపోలోలో చికిత్సActor Rajinikanth
2020-12-25 13:35:13

సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలింది.రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు సమాచారం.  అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. అయితే రెండు రోజుల క్రితం కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు. షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపేశారు. మరోవైపు రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు. అధిక రక్తపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారని, ఆయనకు ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. 

More Related Stories