భీమ్ కు జోడిగా విజయ్ హీరోయిన్Aishwarya Rajesh
2020-11-03 08:00:36

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రాజమౌళి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. కొమురంభీమ్, అల్లూరి కథల ఆధారంగా చిత్రిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీమ్ గా..రాంచరణ్ అల్లూరిగా నటిస్తున్నారు. కాగా చరణ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా బట్ నటిస్తుండగా ఎన్టీఆర్ పక్కన ఇంగ్లీష్ భామ నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కు మరో హీరోయిన్ గా తెలుగు భామ ఐశ్వర్యా రాజేష్ నటించనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ లో ఐశ్వర్య ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్ ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ పక్కన నటించి మెప్పించింది. సువర్ణ పాత్రలో నటించిన ఐశ్వర్య నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతే కాకుండా ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్ లో ఐశ్వర్య నటిస్తుందని వార్త చక్కర్లు కొడుతున్నప్పటికి టీం మాత్రం అధికారికంగా ఇప్పటివరకి ఎలాంటి ప్రకటన చేయలేదు.

More Related Stories