అనుష్కకు ఇంకెన్ని సార్లు పెళ్లిళ్లు చేస్తార్రా నాయనా..anushka
2020-04-15 13:47:48

ఇప్పుడు సగటు సినీ ప్రేక్షకుడు ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. ఎప్పుడు చూసినా అనుష్క పెళ్లి వీళ్లతో.. వాళ్లతో అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. దాంతో అందరికీ ఈ టాపిక్ పై ఆసక్తి కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే ప్రశ్న అనుష్క పెళ్లెప్పుడు.. నిజంగానే ఇది ఒక గండికోట రహస్యం. ఎందుకంటే ఎప్పుడు అడిగినా ఇప్పుడు అప్పుడు అంటుంది కానీ ఆ అప్పుడు ఎప్పుడో చెప్పడం లేదు అనుష్క. వయసు 40కి వస్తున్నా కూడా ఇంకా పెళ్లి మీద ధ్యాస లేదు అంటుంది ఈ జేజమ్మ. ప్రస్తుతానికి సినిమాలతో బిజీగా ఉంది అనుష్క. రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ ఇప్పుడు కోన వెంకట్ సినిమాతో వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. దాంతో ప్రస్తుతం కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే పెళ్లి ముచ్చట మరోసారి అనుష్క ముందు వాలింది. దీనికి ఎప్పట్లాగే మరోసారి ఇప్పుడు కాదు అంటూ తప్పించుకుంది ఈ భామ‌.

పెళ్లెప్పుడు అంటే తగిన వరుడు దొరికినప్పుడు అంటూ సమాధానం చెబుతుంది అనుష్క. మరి ఆ తగిన వరుడు ఎప్పుడు దొరుకుతాడు అంటే సమాధానం చెప్పడం లేదు. ప్రభాస్ తో అనుష్క‌కు ప్రేమాయణం నడుస్తుందని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ప్రభాస్ మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించాడు. అనుష్క తన స్నేహితురాలు మాత్రమే.. తమ బంధాన్ని త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దంటూ అభిమానుల‌ను కోరుతున్నాడు. ఇక అనుష్క కూడా ప్రభాస్ తో పెళ్లి అంటే నవ్వుకుంటుంది. తను మంచి స్నేహితుడు అంటూ కొట్టిపారేస్తుంది. ఇదే సమయంలో ఆ మధ్య ఓ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. దీన్ని కూడా ఖండించింది ఈమె. మొన్నటికి మొన్న ఓ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క పెళ్లి జరగబోతుందని టాపిక్ వచ్చింది.. ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లి టాపిక్ వచ్చింది. దాంతో ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా విసుగెత్తిపోతున్నారు స్వీటీ పెళ్లి టాపిక్ విని.

More Related Stories