భూమిక కాపురంలో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్.. Bhumika Chawla
2020-10-21 15:20:47

హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఎందుకు..? ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. నటించింది తక్కువ సినిమాలే కానీ అందులో ఇండస్ట్రీ హిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఖుషీ, సింహాద్రి, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి నెంబర్ వన్ అనిపించుకుంది భూమిక. ఆ తర్వాత మెల్లగా సినిమాలకు దూరం అయిపోయింది. తన యోగా గురు భ‌ర‌త్ ఠాకూర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఈమె. ఆ తర్వాత ఇద్దరూ హాయిగా సంసారం చేసుకుంటున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని.. ఇద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతుంది. దానిపై ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా భూమిక స్పందించకపోవడంతో నిజమే అనుకున్నారంతా. పైగా ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు కూడా భూమికను చుట్టుముట్టాయనే వార్తలు వచ్చాయి. అందుకే తెలుగులో ఎంసిఏతో రీ ఎంట్రీ ఇచ్చిందని.. ఆ తర్వాత సవ్యసాచి, రూలర్ లాంటి సినిమాల్లో నటించిందని తెలుస్తుంది. పారితోషికం కోసమే హాట్ ఫోటోషూట్స్ కూడా చేసింది భూమిక. 

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న `సీటీమార్‌` చిత్రంలో నటిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చివరిదశకు వచ్చింది. ఇదిలా వుంటే త‌న పెళ్లి జీవితంపై వస్తున్న వార్తలపై భూమిక సీరియస్ గా స్పందించింది. 2007లో ఇదే రోజు యోగా గురు భ‌ర‌త్ ఠాకూర్‌ని వివాహం చేసుకున్న భూమికకు ఓ బాబు కూడా వున్నాడు. తను భర్తతో విడిపోలేదని.. అనవసరంగా లేనిపోని రాతలు రాసి తమ కాపురంలో నిప్పులు పోయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తమ పెళ్లిరోజు సందర్భంగా భ‌ర‌త్ ఠకూర్‌తో వున్న ఫొటోని షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ పెట్టింది. వెయ్యేళ్ల ప్రయాణ‌మైనా ఒకే అడుగుతో మొదలవుతుంది.. ప్రేమ అంటే అది ప్రేమే.. ప్రేమ‌ని అనుభవించాలి.. అదో అందమైన ప్రయాణం.. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం అంటే మనమే.. దేవుడు మమ్మల్ని మా ప్రయాణాన్ని ఆశీర్వదించాలి.. మీపై నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది అంటూ పోస్ట్ చేసింది. దాంతో భూమిక దంపతుల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని అర్థమవుతుంది. 

More Related Stories