రీఎంట్రీకి సిద్దమవుతున్న పవన్ హీరోయిన్



Meera Jasmine
2021-04-16 18:44:05

నిన్నటితరం హీరోయిన్ లు ఒకరి తరవాత మరొకరు రీఎంట్రీ ఇస్తున్నారు. అక్క..వదిన పాత్రల్లో అలరిస్తున్నారు. ఇప్పటికే స్నేహ, భూమిక, మీనా అలాంటి పాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో నటి మీరా జాస్మిన్ కూడా చేరిపోయింది. మీరా జాస్మిన్ "అమ్మాయి బాగుంది" సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత "గుడుంబా శంకర్" సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మీరా జాస్మిన్ అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరవాత పలువురు హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది. 

అయితే పెళ్లి తరవాత మాత్రం మీరా జాస్మిన్ సినిమాలకు దూరం అయింది. ఇక తాజాగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఓ మలయాళ సినిమాలో మీరా జాస్మిన్ గెస్ట్ రోల్ చేసింది. అంతే కాకుండా సత్యన్ అంతే కాడ్ అనే దర్శకుడి డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేయబోతుందట. ఇదిలా ఉండగా తన స్థాయికి తగ్గ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని టాలీవుడ్ కు సైతం సంకేతాలు ఇస్తుందట. మరి టాలీవుడ్ లో మీరా రీఎంట్రీ ఉంటుందా లేదా చూడాలి.

More Related Stories