సీఎం జగన్ పై పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు  Actress Payal Rajput
2020-12-14 23:28:27

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రశంసలు కురిపించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజి మైదానంలో నేడు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల ప్రారంబోత్సవానికి పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాయల్ మాట్లాడుతూ...అందరూ బాగున్నారా అని తెలుగులో అడిగింది. అనంతరం స్టార్స్ అందరూ డిసెంబర్ లొనే పుడతారని.. మన డైనమిక్ సీఎం జగన్ తో పాటు తాను కూడా డిసెంబర్ లొనే పుట్టానని పేర్కొంది. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. కాలేజీ రోజుల్లో బాగా క్రికెట్ ఆడేదన్నని చెప్పుకొచ్చింది. రాజమహేంద్రవరంలో గోదావరి అందాలు బాగుంటాయని..ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకుంది. హాట్ అందాలతో పాటు ఎక్స్ ప్రెషన్స్ తో పాయల్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ భామ ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తుంది.

More Related Stories