పేపర్ రచ్చ రేపుతున్న పాయల్ పాపPayal Rajput
2020-04-23 14:27:00

ఆర్ ఎక్స్ 100 లాంటి బోల్డ్ మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి బ్లాక్ బాస్టర్ కొట్టింది నటి పాయల్ రాజ్ పుత్. ఈమె నటించిన మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ కావడం ఆ సినిమాలో ఈమెది విలన్ తరహా రోల్ అయినా ఆమె అందానికి నటనకు ఫిదా అయిన అందరు మంత్ర ముగ్దులైపోయారు. దీంతో ఆమెకు టాప్ యంగ్ హీరోల నుచి కాక టాప్ సీనియర్ హీరోల నుండి వరసపెట్టి అవకాశాలు వస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.  అయితే ఆమె కొన్ని ఒప్పుకుని చేతులు కూడా కాల్చుకుంది అందుకోండి అది వేరే విషయం. 

ఇక లాక్ డౌన్ క్రమంలో పాయల్ రాజ్ పుత్ ఎల్లో పిల్లో ఫొటో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఒక్క ఫొటోతో ఎప్పుడూ రానటువంటి క్రేజ్ ఆమెకి తెచ్చిపెట్టడంతో ఆమె మరలా అలాంటి ఫోటోను వదిలింది. మొన్న పిల్లో చుట్టుకోగా ఈ సారి ఒంటికి న్యూస్ పేపర్ చుట్టుకుని కింద, పైన కవర్ అయ్యేలా కుర్రాళ్ళలో సెగలు రేపే ఫొటోని షేర్ చేసింది.  పాయల్ రాజ్ పుత్ చేస్తున్న ఈ గ్లామర్ ఒలకబోతకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక దీని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇది బ్రేకింగ్ న్యూస్ ఔట్ ఫిట్ అంటూ కొంతమంది ఈ ఫోజుపై జోక్‌ లు పేలుస్తున్నారు.  మీరు కూడా చూసి ఆనందించండి.

More Related Stories