ఆదిపురుష్ షూటింగ్ షురూ...కానీAdipurush
2021-07-03 12:09:43

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇటీవల వాయిదా పడింది. కాగా ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకోగా ఈరోజు మూడో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. 

అయితే ప్రభాస్ మాత్రం ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దాంతో రాధే శ్యామ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆది పురుష్ షూటింగ్ లో పాల్గొంటారు. ఇక అప్పటి వరకు ఆదిపురుష్ సినిమాలో ఇతర నటీనటుల పై కీలక సన్నివేశాలను చిత్రించనున్నారు. ఇక రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రభాస్ కు జోడిగా నటిస్తోంది .

అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ పూర్తయిన వెంటనే ఆది పురుష్ , సలార్ షూటింగ్ లను ఏకకాలంలో పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Related Stories