ప్రభాస్ ఆదిపురుష్ నుండి అప్డేట్Adipurush
2021-01-19 12:16:10

బాహుబలి భారీ విజయం తరవాత ప్రభాస్  పాన్ ఇండియా హీరోగా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమా ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో "రాధే శ్యామ్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పిరియాడికల్ లవ్ స్టొరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో "ఆడిపురుష్" అనే సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రభాస్ కు విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను టిసిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ తో పాటు ఓంరౌత్, ప్రసాద్ సురాత్, రాజేష్ నాయర్ కలిసి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆది పురుష్ చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ని ప్రకటించింది.. ఈ సినిమా మోషన్ కాప్చర్ వర్క్ ను చిత్ర బృందం ఈరోజు ప్రారంభించింది. ఈ టెక్నాలజిని ఇంటర్ నేషనల్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుటారు. ఈ సందర్భంగా సినిమా కోసం పనిచేస్తున్న విఎఫ్ఎక్స్ టీమ్ మొత్తాన్ని దర్శకుడు పరిచయం చేసారు. 

More Related Stories