పూజారి పాత్రలో నటిస్తున్న ఆదిత్య ఓంAditya Om
2021-05-07 00:48:33

వెరైటీ చిత్రాలతో ఆకట్టుకొన్న ఆదిత్య ఓం హీరో గా నటిస్తున్న సరికొత్త చిత్రం 'దహనం'.. కొందరు శక్తివంతమైన బిజినెస్ మెన్ ల నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమా లో ఆదిత్య ఓం.. 1980వ కాలం లో సాగే ఈ సినిమా లో ఆదిత్య పూర్తిగా అప్పటి కాలం వ్యక్తిగా కనిపించబోతున్నాడు.. అందుకు తగ్గ మేకోవర్ కూడా పూర్తి చేశారు.. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పతాకంపై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయి లు ఈ సినిమా ను సంయుక్తంగా.  నిర్మిస్తుండగా ఎడారి మూర్తి సాయి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. డాక్టర్ పి సతీష్ కుమార్ బాణీలను సమకూరుస్తున్నారు.. ఎఫ్ఎం బాబాయి , శాంతి చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుపుకుంది.. కె.విశ్వనాథ్, బాపు గారి సినిమాల మ్యాజిక్ ఫీల్ ఈ సినిమా లో ఉండబోతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు చిత్ర నిర్మాతలు..

More Related Stories