అడవి శేష్ హీరోగా హిట్ 2...ప్రీలుక్ ను వ‌దిలిన నానిAdivi Sesh
2021-03-20 18:31:36

నాని నిర్మాణంలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన సినిమా హిట్‌. ఈ చిత్రానికి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వహించారు. క్రైం థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి విమ‌ర్శకుల నుండి ప్ర‌శంస‌లు అంద‌డంతో ఈ చిత్రానికి సీక్వెల్ తీయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ముందుగానే ప్ర‌క‌టించారు. అయితే హిట్ సీక్వెల్ లో హీరోగా మాత్రం విశ్వ‌క్ సేన్ కాకుండా అడవి శేషు హీరోగా న‌టిస్తున్నారు. సాధారంణంగా సీక్వెల్స్ లో సేమ్ హీరోనే తీసుకుంటారు. కానీ విశ్వ‌క్ నో చెప్పారో లేదంటే మేక‌ర్స్ నిర్న‌యం తీసుకున్నారో తెలియ‌దు కానీ అడ‌వి శేషును హీరోగా ఎంపిక చేశారు.  

కాగా తాజాగా అడ‌విశేషు కు వెల్ క‌మ్ చెబుతూ చిత్ర‌యూనిట్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. ఈ సినిమాలో అడవి శేషు క్రిష్ణ దాస్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ర‌వితేజ ఖిలాడి సినిమాలోనూ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కోమ‌లి కూడా న‌టిస్తోంది. ఇక హిట్ సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించ‌గా...హిట్ 2 సినిమాను ఆంధ్రా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

More Related Stories