అడవి శేష్ మేజ‌ర్ విడుద‌ల వాయిదా



 Adivi Sesh Major
2021-05-26 16:56:18

ప్ర‌స్తుతం క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. దాంతో సినిమాలన్నీ విడుద‌ల‌ను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుద‌ల‌ను వాయిదా వేసుకోగా చాలా త‌క్కువ సినిమాలు ఓటీటీలో విడుద‌ల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక విడుద‌ల‌ను వాయిదా వేసుకున్న చిత్రాల్లో..ట‌క్ జ‌గ‌దీశ్, ఆచార్య‌, ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం సినిమాలున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ లో మ‌రో మోస్ట్ అవెయిటెడ్ సినిమా కూడా వాయిదా ప‌డింది. టాలెంటెడ్ హీరో అడ‌విశేష్ న‌టించిన మేజ‌ర్ సినిమాను జూన్ 2వ తేదీన విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా విడుద‌ల వాయిదా వేస్తున్న‌ట్టు హీరో అడ‌విశేష్ ప్ర‌క‌టించారు. 

మేజ‌ర్ చిత్రాన్ని ముందుగా జులై 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నాము. సినిమా విడుద‌ల‌య్యాక సెలబ్రేట్ చేసుకుందాం. మామూలుగా ఉండ‌దు అంటూ అడ‌విశేష్ త‌న పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు శ‌శి కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలో సాయి మంజ్రీక‌ర్, సోబితా దులిపాల హీరోయిన్ లు గా న‌టిస్తున్నారు. 2008 లో జ‌రిగిన ముంబై ఎటాక్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ప‌రిస్థితితులు సాధార‌ణ స్థితికి రాగానే మేక‌ర్స్ మ‌రో తేదీని  ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. 

More Related Stories