ఆహా..నెట్ ఫ్లిక్స్ మధ్య కొనసాగుతున్న మీమ్స్ వార్



AHa NetFlix
2021-01-26 17:29:18

ఒకేరోజున రెండు సినిమాలు గనక విడుదలైతే హీరోల అభిమానులు మా హీరో తోపు అంటే మా హీరో తోపు అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. కానీ నిర్మాణ సంస్థలు ఎప్పుడూ అస్సలు మరొకరి సినిమాపై ఎలాంటి కామెంట్స్ చేయవు. వీలైతే వాళ్ళ సినిమా గురించి డబ్బా కొట్టుకుంటారు లేదంటే లేదు. కానీ ప్రస్తుతం వచ్చిన ఓటీటీ సంస్థలు ఒకరిపై ఒకరు విమర్శలు, ట్రోల్స్ చేసుకుంటున్నాయి. గతంలో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఒకదానిపై మరొకటి విమర్శలకు దిగాయి. ఇక ఇప్పుడు అల్లు వారి ఓటీటీ "ఆహా", నెట్ ఫ్లిక్స్ మధ్య మీమ్స్ వార్ నడుస్తుంది. నిజానికి నెట్ ఫ్లిక్స్ ముందు కామ్ గానే ఉంది. కానీ ఆహా నే గెలికి మరీ ట్రోల్స్ చేయించుకుంది. 

నెట్ ఫ్లిక్స్ హిందీ సూపర్ హిట్ అయిన "లస్ట్ స్టోరీస్" ను తెలుగులో రీమేక్ చేస్తోంది. ఈ సిరీస్ ను "చందమామ కథలు" ఒరిజినల్స్ పేరుతో తెరకెక్కిస్తోంది. కాగా ఈ సిరీస్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసి "తెలుగులో మొదటిసారి ఒరిజినల్స్" అంటూ పేర్కొంది. ఇక ఇది చూసిన ఆహా మా దగ్గర బోలెడు ఒరిజినల్స్ ఉన్నాయి. అరుస్తున్నమా అంటూ కయ్యానికి కాలు దువింది. ఇక నెట్ ఫ్లిక్స్ వెంటనే స్పందించలేదు కానీ..టైమ్ చూసుకుని "వీడు వీడి వేషాలు..గొడవలు ఎందుకు బాధ్యత ఉండక్కర్లేదా" అంటూ మీమ్స్ వేసింది. అయితే ఈ రెండూ ప్రత్యక్షంగా పేర్లు పెట్టుకుని విమర్శలు చేసుకోవడం లేదు.. కానీ కచ్చితంగా ఒకదాన్ని ఉద్దేశించి మరొకటి మీమ్స్ వేస్తుందని అర్థం అయిపోతుంది.

More Related Stories