అజిత్ భారీ విరాళం.. విజయ్ ఒక్కడే బ్యాలెన్స్ ఇంక..Ajith
2020-04-07 18:02:53

తమిళనాట రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న హీరో అజిత్. కొన్ని రోజులుగా ఈయన విరాళం ఎందుకు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాంతో కాస్త ఆలస్యమైనా కూడా ఇప్పుడు ఈయన భారీ విరాళమే ప్రకటించాడు. ఇప్పటి వరకు తమిళ హీరోల్లో అత్యధికంగా కోటి 25 లక్షల విరాళం అందించాడు అజిత్. అందులో 50 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధి.. మరో 50 లక్షలు ప్రధానమంత్రి సహాయనిధితో పాటు 25 లక్షలు సినిమా కార్మికులకు అనౌన్స్ చేసాడు అజిత్. దాంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ చాలా మంది హీరోలు విరాళం ప్రకటించారు. 

తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ 50 లక్షలు.. ధనుష్ 15 లక్షలు.. విజయ్ సేతుపతి 10 లక్షలు.. శివ కార్తికేయన్ 10 లక్షలు.. కమల్ హాసన్ 50 లక్షలు ఇచ్చారు. హీరోయిన్లలో నయనతార 20 లక్షలు సినిమా కార్మికుల కోసం ఇచ్చింది. ఇప్పుడు అజిత్ కూడా ఇచ్చేసాడు. దాంతో విజయ్ ఒక్కడే మిగిలిపోయాడు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఈ హీరో ఎందుకు విరాళం ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ ఆపద వచ్చినా కూడా అందరి కంటే ముందు విజయ్ కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అయితే ఈసారి మాత్రం కాస్త ఆలస్యం చేస్తున్నాడు. దానికి కూడా ఏవో కారణాలు ఉన్నాయి అంటున్నారు అభిమానులు. కానీ విమర్శకులు మాత్రం ఇదే అదునుగా విజయ్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. నీతులు చెప్పడం కాదు ముందు విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలవండి అంటూ విజయ్ ను ఓపెన్ గానే విమర్శిస్తున్నారు. మరి దీనికి సమాధానంగా విజయ్ విరాళం ఎంత ఇస్తారో చూడాలి. 

More Related Stories