అజిత్ రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. Ajith Shalini
2020-11-28 10:58:34

హీరో అజిత్ అనగానే తెలుగు వాళ్లకు ఎక్కువగా గుర్తువచ్చే సినిమాలు ప్రేమలేఖ, కల్కి.  ఈ సినిమాలు అజిత్ కు విజయాలతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా తెచ్చిపెట్టాయి. కేవలం సినిమాలలోనే కాకుండా అజిత్ నిజ జీవితంలో కూడా ఒక గాఢమైన ప్రేమకథ ఉంది. 90లో హీరోయిన్ హిరా రాజగోపాల్ ను అజిత్ గాఢంగా ప్రేమించాడట. వీరిద్దరి ప్రేమకథ అప్పట్లో టాక్ ఆప్ థి టౌన్ అయ్యింది కూడా. అజిత్ హిరా రాజగోపాల్ కి తరుచూ ప్రేమలేఖలు కూడా రాస్తూ వుండేవారంట. ఇలా కొనసాగిన వీళ్లిద్దరి ప్రేమకథకు హిరా రాజగోపాల్ తల్లి ఒప్పుకోకపోవడంతో ప్రేమకథ పెళ్లి వరకు వెళ్ళలేదు. 

అందరూ మర్చిపోయిన ఈ ప్రేమకథ ను ఇపుడు యాక్టర్ భాయిల్వాన్ రంగానాథన్ మరోసారి తెర మీదకు తెచ్చారు. అజిత్, హిరా రాజగోపాల్ కి రాసిన ప్రేమలేఖలో ఒక దాన్ని నేను కూడా చదివాను అని భాయ్ల్వాన్ రంగానాథన్ తెలిపారు. అజిత్ ,హిరా రాజాగోపాల్ కలిసి కదాల్ కొట్టే, తొడారాము, అనే రెండు సినిమాలలో కలిసి నటించారు. ఈ ప్రేమకథ తరువాత అజిత్ మరో హీరోయిన్ షాలిని ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇదిలా ఉండగా అజిత్ ప్రస్తుతం వాలిమై అనే చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు హెచ్.వినోత్ దర్శకత్వం వహిడ్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది.
 

More Related Stories