చోర్ బజార్ లో ఆకాష్ పూరీ..



 Akash Puri
2021-02-18 12:11:58

పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ తన నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టాడు. ఆకాష్ మెహబూబా సినిమాతో  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ సినిమా తరువాత "రొమాంటిక్" అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఇప్పుడు మరో సినిమాను మొదలెట్టాడు. ఈ చిత్రాన్ని "జార్జ్ రెడ్డి" దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సినిమాకు "చోర్ బజార్" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈనెల 26 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను క్రైం కామెడీ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కామెడీ, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చిత్రంలో పోసాని కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు..టెక్నీకల్ సిబ్బందిని త్వరలోనే ప్రకటించనున్నారు.

More Related Stories