అఖండ క్లైమాక్స్ తో బిజీగా బోయ‌పాటి



Akhanda
2021-07-01 14:27:13

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'అఖండ' ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే తెలుగు సినీ జనాలకు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు , ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' బ్లాక్ బాస్టర్ లు అవడమే. ఇందులో బాలకృష్ణ రైతుగా, అగోర రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు ,ఇందుకు సంబంధించిన ప్రోమో లను కూడా ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా ఇవి ఈ సినిమాపై  అంచనాలను మరింత పెంచాయి. 

ఈ సినిమాలో లో హీరో సరసన ప్రగ్యా జైస్వాల్ ,పూర్ణ నటిస్తున్నారు . ఈ చిత్రం ఇప్పటికే క్లైమాక్స్ మినహా మిగతా షూటింగ్ పూర్తి అయ్యింది. క్లైమాక్స్  తీద్దాం అనుకున్న సమయానికే కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి వల్ల షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది .ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దానికోసం బోయపాటి ఆంధ్ర లోని కొన్ని ప్రదేశాలను చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఒక దానిని ఫిక్స్ చేసి  సినిమా షూటింగ్ ని ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి.

More Related Stories